: నేను చేసే రాజకీయం అధికారం కోసం కానేకాదు: పవన్ కల్యాణ్
ప్రజలను పాలించాలన్న ఆశతో అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి జరిగిన తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో 'కాబోయే సీఎం' అని అభిమానుల కేకలు పెడుతుంటే, పవన్ స్పందించారు. "మీ కేకలు వినిపించక కాదు... కానీ దానికి ఎందుకు స్పందించనంటే... నేను ప్రతిసారి అదే చెబుతాను. ప్రజాక్షేమం కావాలంటే, అధికారం అంతిమలక్ష్యం కాకూడదన్న భావనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది. జరగలేదా ఇంకా మంచిది. అంతే.. దానిమీదే నేను ఉండాలన్నది కాదు. మీ అందరి భవిష్యత్తూ బాగుండాలి. నా బిడ్డలు ఒకటి, మీ బిడ్డలు ఒకటీ కాదు. నాకు అందరి బిడ్డలూ ఒకటే" అని అన్నారు.