: ఇండియాలో విన్ డీసిల్... దీపికకు తోడు ఇక్కడే... ట్విట్టర్ లో యూపీ కొత్త సీఎంపై చమక్కులు!


యోగి ఆదిత్యనాథ్... యూపీ సీఎంగా ఎన్నికైన తరువాత, ఆయన పేరు సెర్చింజన్లలో హల్ చల్ చేసింది. ఇక ఆయన చిత్రాలను చూసిన పలువురు, హాలీవుడ్ స్టార్ విన్ డీసెల్ తో పోలుస్తున్నారు. ట్విట్టర్ లో ఆయన పేరిట ట్రెండింగ్ అవుతున్న చిత్రాల్లో విన్ డీసెల్ ఫోటో పక్కన పెట్టి, తమదైన తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న రూప సారూప్యాన్ని పోల్చుతున్నారు. వీరిద్దరూ కేవలం పుట్టుకలోనే వేరుపడ్డారని హరీష్ గోయంకా వ్యాఖ్యానించగా, మరికొందరు దీపికా, పదుకొనే, విన్ డీసెల్ ఉన్న చిత్రాన్ని ఫోటోషాప్ లో మార్చి ఫోటోలు పెట్టుకున్నారు. దీపికకు ఇండియాలోనే విన్ డీసెల్ దొరికాడని, వీరిద్దరి మధ్యా తనకు తేడా తెలియదన్న అర్థం వచ్చేలా కాజోల్, యూపీకి సీఎంగా ఎన్నికైనందుకు కొందరు విన్ కు అభినందనలు తెలిపారని కృష్ణా ఠాకూర్, యూపీ సీఎం విన్ డీసిలా? లేక యోగి ఆదిత్యనాథా? అని ఆలియాభట్ స్పందించారు. ఇదే విషయంలో క్రికెటర్ రవీంద్ర జడేజా, అశుతోష్ సింగ్ తదితరులు పెట్టిన ట్వీట్లు సైతం వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News