: బరువైన వడగళ్లు బండల్లా మీద పది... ప్రకాశం జిల్లాలో మరణించిన మహిళ
వడగళ్ల వాన నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పామూరు మండలం బొట్ల గూడూరులో కురిసిన వడగళ్ల వాన దెబ్బకు ఓ మహిళ రోడ్డుపైనే కుప్పకూలింది. బరువైన వడగళ్లు ఆమెపై పడటాన్ని గమనించిన స్థానికులు, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రభుత్వం స్పందించి ఆమెకు పరిహారం ఇవ్వాలని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక పెద్దలు డిమాండ్ చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే.