: నా భర్తను లాగేసుకున్నారు: శశికళ వర్గంపై దీప నిప్పులు


తాను ప్రారంభించిన 'ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై' పార్టీ గురించి వస్తున్న వార్తలపై దివంగత తమిళనాడు సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పందించారు. తన భర్తను శశికళ వర్గం ప్రలోభ పెట్టిందని, వారి కారణంగానే, తన భర్త కొత్త పార్టీ పెడతానని ప్రకటించారని ఆమె ఆరోపించారు. తన పార్టీని రద్దు చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కార్యకర్తలు ఎవరూ వీటిని నమ్మవద్దని దీప పిలుపునిచ్చారు. తన భర్త వ్యాఖ్యల వెనుక శశికళ వర్గం ఉందని, వారే అసత్యపు ప్రచారం చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదని, సొంత మనుషులే వ్యతిరేకమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో తన భర్త ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News