: పవన్ కల్యాణ్ కు డబ్బు మీద ఆశ, ప్రీతి లేవు: హాస్య నటుడు అలీ
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అద్భుతమైన మనిషని హాస్య నటుడు అలీ తెలిపాడు. పవన్ తో తనకు 20 ఏళ్ల అనుబంధం వుందంటే ఆశ్చర్యంగా ఉందని అలీ చెప్పాడు. హైదరాబాదులోని 'కాటమరాయుడు' శిల్పకళావేదిక వద్ద పవన్ కల్యాణ్ గురించి అలీ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పాడు. పవన్ కల్యాణ్ ను ఒకసారి కలిస్తే వారి పేరును గుర్తుంచుకుని కుశలప్రశ్నలు అడుగుతాడని, పవన్ మెమరీలో వేలాది పేర్లు గుర్తుంటాయని అలీ అన్నాడు.
అలాగ్ పవన్ కల్యాణ్ లో సుగుణం ఏంటంటే, డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాడు తప్ప, దాని మీద ఆశ కానీ ప్రీతి కానీ ఉండవని చెప్పాడు. అలాంటి ఆశ లేదా ప్రీతి ఉంటే పవన్ కల్యాణ్ ను ఈ రోజు ఇంకోలా చూసి ఉండేవారమని అన్నాడు. తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే కనీసం అమ్మకాలు పెరుగుతాయి కదా? అని ఆలోచించి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పాడని, పవన్ కల్యాణ్ చాలా గొప్పమనిషని అలీ చెప్పాడు. 'కాటమరాయుడు' సినిమా ప్రతిఒక్కర్నీ ఆకట్టుకుంటుందని అలీ అన్నాడు.