: 'కాటమరాయుడు' వేదికకు వెల్లువెత్తుతున్న అభిమానులు


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కాటమరాయుడు' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని శిల్పకళావేదికలో కాసేపట్లో ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ సినీ ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ భావించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో 'కాటమరాయుడు' ప్రీరిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. దీంతో శిల్పకళావేదిక పరిసరాలన్నీ పవన్ కల్యాణ్ నినాదాలతో హోరెత్తుతున్నాయి. 

  • Loading...

More Telugu News