: తనను ప్రేమించలేదన్న కసితో.. నవవధువు గొంతు కోసిన యువకుడు!


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను కాదన్నదన్న కసితో ఓ న‌వ‌వ‌ధువు గొంతు కోశాడు ఓ క‌సాయి. ఆ రాష్ట్రంలోని సాహిబాబాద్‌ టౌన్‌షిప్‌కు చెందిన  ఓ యువతి(26)కి ఇటీవలే వివాహం జరిగింది. అయితే, హోలీ పండుగ సంద‌ర్భంగా ఆమె.. త‌న పుట్టింటికి వ‌చ్చింది. వారి పొరుగింట్లో ఉండే యువ‌కుడు రాజేవ్‌ క‌శ్య‌ప్‌ గతంలో ఆమెను ప్రేమించాడు. అయితే, అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో తనకు దక్కలేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడిచేసి గొంతు కోశాడు. ఆ యువ‌తి భ‌యంతో కేక‌లు వేయడంతో స్థానికులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని, ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువ‌కుడు వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయాడు. తాను వేరే వివాహం చేసుకున్నాననే కోపంతోనే తనను ఆ యువ‌కుడు చంపాలనుకున్నాడని ఆమె ప్రాథమిక వాంగ్మూలంలో పోలీసులకు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News