: ఆమె నా జీవితాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి!: ప్రియురాలి గురించి కపిల్ శర్మ


హిందీ బుల్లితెర ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియాలోకి వచ్చిన కపిల్ శర్మ మరో అరగంటలో తన అభిమానులందరికీ శుభవార్త చెబుతానని తెలిపాడు. అరగంట తరువాత మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కపిల్ శర్మ ఒక ఫోటోను పోస్టు చేశాడు. 'ఆ ఫోటోలో వున్న ఆమె నా బెటర్ హాఫ్ అని అనను... అయితే నా జీవితానికి పూర్ణత్వం తెచ్చింది ఆమే'నని అన్నాడు. ఆమె పేరు జిన్నీ అని...ఆమెను అంతా స్వాగతించాలని కపిల్ సూచించాడు. కాగా, 'కామెడీ విత్ కపిల్' తో పాప్యులారిటీ సంపాదించుకున్న కపిల్... బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ కోసం వచ్చే హీరోయన్లతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మంచి ఆదరణ పొందాడు.


  • Loading...

More Telugu News