: యూపీ సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ.. లక్నోలో చర్చలు జరుపుతున్న వెంకయ్య!
దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై బీజేపీ ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో లక్నోలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేరుకుని పలువురు నేతలతో చర్చిస్తున్నారు. ఆ రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా అక్కడకు క్యూ కడుతున్నారు. అయితే, తాను సీఎం పదవి రేసులో లేనని మనోజ్‌సిన్హా ప్రకటించారు. మరోవైపు సీఎం ఎంపిక అంశంలో చర్చించడానికి ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగింది. కాగా, తనకు అవకాశం ఇవ్వాలని ఏంపీ యోగి ఆదిత్య నాథ్ బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. మరో నేత కేశవ్ మౌర్యకు అనుకూలంగా ఆయన అనుచరులు లక్నోలో నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి వెళ్లిన కేశవ్ మౌర్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అతిత్ షాతో భేటీ అయ్యారు.