: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా!
రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఇచ్చిన 451 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిన్న బ్యాటింగ్‌కు దిగిన లోకేశ్ రాహుల్ 67 పరుగులకి అవుటయిన విషయం తెలిసిందే. 120/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్(82), పుజారా (40)నిలకడైన ఆటతీరును కనబర్చారు. అయితే, ఒకీఫ్ బౌలింగ్‌లో విజయ్ వెనుదిగాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులతో క్రీజులో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, ఒకీఫ్ ఒక్కో వికెట్ తీశారు.