: వైసీపీకి గుడ్ బై చెప్పిన తూర్పుగోదావరి జిల్లా నేత!
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు అయిన గిరజాల వెంకటస్వామి నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వైసీపీ కార్యాలయానికి పంపానని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన గిరజాల వెంకటస్వామి నాయుడు గతంలో బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం, వైసీపీలో చేరి గత ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.