: మోదీకి మలేషియా ప్రధాని అభినందనలు!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి మలేషియా ప్రధాని మహ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. కాగా, యూపీలో బీజేపీ సాధించిన విజయంపై మోదీని అభినందిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్, ఖతార్ చక్రవర్తి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ, అబుదబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నయన్ దబీ, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఇప్పటికే అభినందనలు తెలిపారు.