: వైజాగ్ లో జిమ్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపార విస్తరణకు పూనుకుంది. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో జిమ్ లు ఏర్పాటు చేసిన రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా తన వ్యాపారాన్ని వైజాగ్ కు విస్తరించింది. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, అఖిల్ అక్కినేనితో కలసి విశాఖపట్టణంలోని తన జిమ్ ను ఈ రోజు ప్రారంభించింది. ఈ సందర్భంగా అఖిల్ తో కలిసి రకుల్ పలు ఎక్సర్ సైజులు చేసి, అలరించింది. అనంతరం రకుల్ మాట్లాడుతూ, హైదరాబాదులో వివిధ ప్రాంతాల్లో జిమ్ లు ఏర్పాటు చేశానని, ఏపీలో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానని, అందులో భాగంగా అన్ని సౌకర్యాలతో జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించానని, అందుకే విశాఖపట్టణంలో జిమ్ ఏర్పాటు చేశానని రకుల్ తెలిపింది.