: గంగూలీ వర్సెస్ ధోనీ... ఆసక్తి రేపుతున్న విజయ్ హజారే ట్రోఫీ సెమీస్!


టీమిండియాను అగ్రస్థానానికి చేర్చిన దిగ్గజ మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ తమ రాష్ట్ర జట్లను గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో టీమిండియాకు దూకుడు మంత్రం నేర్పిన గురువు గంగూలీ అయితే... కుదురుకున్న జట్టును ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా ఉన్నత శిఖరాలధిరోహించేలా చేసిన ఘనత ధోనీది.

ఇప్పుడు వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీలో తమ రాష్ట్ర జట్లకు మద్దతు పలుకుతున్నారు. దేశవాళీ ట్రోఫీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ధోనీ జార్ఖండ్ జట్టు కెప్టెన్ గా బరిలో దిగుతుండగా, బెంగాల్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ దాదాను సహాయం కోరాడు. దీంతో ధోనీకి దీటుగా వ్యూహాలు రచించిన దాదా, మ్యాచ్ చూసేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్ లో బెంగాల్, జార్ఖండ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనున్నట్టు స్పష్టమవుతోంది. 

  • Loading...

More Telugu News