: ప్రధాని మోదీ పాలనపై మెహబూబా ముఫ్తీ ప్రశంసలు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్రీకృత స‌ర్కారుని నడుపుతున్నారన్న విమర్శలను జమ్మూ-కశ్మీరు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొట్టిపారేశారు. ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా టుడే కాంక్లేవ్‌ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మోదీ చేస్తోన్న కృషి అద్భుత‌మైంద‌ని ఆమె ప్ర‌శంసించారు. భార‌తదేశాన్ని మోదీ నిజమైన సమాఖ్య నిర్మాణంగా తీర్చిదిద్దాలని పాటుప‌డుతున్నార‌ని ఆమె అన్నారు. న‌రేంద్ర‌ మోదీ క్షేత్ర స్థాయి నుంచి వచ్చారని పేర్కొన్న ఆమె... ఆయ‌న‌ దేశాన్ని సంస్కరించి, సమాఖ్య నిర్మాణంలోకి తేవాలనుకుంటున్నార‌ని అభినంద‌న‌లు కురిపించారు. దేశంలో రాష్ట్రాల మధ్య పోటీ మంచి ఫ‌లితాల‌నే ఇస్తుంద‌ని, అయితే, ఆ పోటీ అభివృద్ధి కోసం ఉండాలని, రాజ‌కీయ‌ పార్టీల కోసం ఉండ‌కూడ‌ద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News