: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు మధ్య వాడీవేడి సంభాషణ!
తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మండలిలో వారి మధ్య సంభాషణ ఘాటుగా సాగింది. బంగారు తెలంగాణాను బకాయిల తెలంగాణగా మార్చారని రాంచంద్రరావు చేసిన ఆరోపణలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘రాష్ట్రం బకాయిల తెలంగాణ అయితే, దేశాన్ని బకాయిల భారత దేశం అనాలా? రుణమాఫీల వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని మోదీ ఇటీవల అన్నారు. అయితే, యూపీ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించారు? రాష్ట్రానికో న్యాయం, యూపీకో న్యాయమా? ’ అంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. గత బడ్జెట్ లో నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదని, ఈసారి బడ్జెట్ కేటాయింపులు భారీగా తగ్గించారంటూ రాంచంద్రరావు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు.