: అర్ధ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
జార్ఖాండ్ లోని రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 451 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు ఆకట్టుకుంటున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఇన్నింగ్స్ తో సహా ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్ అందులో నాలుగు ఇన్నింగ్స్ లలో అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. తాజాగా 71 బంతులాడిన రాహుల్ 8 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. అవకాశం చిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ, స్కోరు బోర్డును నడిపిస్తున్నాడు. రాహుల్ (55) వేగంగా ఆడుతుండడంతో మురళీ విజయ్ (21) నెమ్మదించాడు. జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో వీరిద్దరూ 25 ఓవర్లలో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.