: రూ. 11 కోట్లు పలికిన రవివర్మ 'దమయంతి'
ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ కుంచె నుంచి జాలు వారిన ఓ అపురూప చిత్రం వేలంపాటలో భారీ ధరకు అమ్ముడుబోయింది. న్యూయార్క్ లోని సోతిబే ఆక్షన్ హౌస్ లో రవి వర్మ గీసిన 'దమయంతి' చిత్రాన్ని వేలం వేశారు. ఈ చిత్రం ఏకంగా రూ. 11.09 కోట్లు పలికింది. వాస్తవానికి ఈ చిత్రానికి రూ. 4.58 కోట్లు వస్తాయని నిర్వాహకులు అంచనా వేశారట. కానీ, అంచనాలను తారుమారు చేస్తూ, భారీ ధర పలికింది ఈ చిత్రం. నలదమయంతి నాటకంలోని ఓ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని ఈ 'దమయంతి' చిత్రాన్ని రవి వర్మ గీశారు. రవివర్మ 20వ శతాబ్దానికి చెందిన వారు. ఈయనను 1979లో భారత ప్రభుత్వం జాతీయ నిధిగా అభివర్ణించింది.