: జిల్లాల పెంపుపై మీడియా అత్యుత్సాహం చూపిస్తోంది: కేసీఆర్
తెలంగాణలో జిల్లాల పెంపుపై మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, జిల్లాల పెంపుపై కేంద్రం సానుకూలంగా లేదంటూ మీడియా అత్యుత్సాహంతో కథనాలను ప్రసారం చేస్తోందని, ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. నిరాధారమైన వార్తలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఉంటే మంచిదని విపక్షాలకు ఆయన సూచించారు. టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్టుగా ముందస్తు ఎన్నికలు రావని, తగిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ అన్నారు. విద్యుత్ సరఫరాలో నాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, తాము మాత్రం సక్సెస్ అయ్యామని కేసీఆర్ చెప్పారు.