: రోజాను చూసి కాళీమాతను చూసినట్లు వణికిపోతున్నారు: సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కాలం ముగుస్తుండడం, మరోవైపు రోజా క్షమాపణలు చెప్పకపోవడంతో మరో సంవత్సరం పాటు ఆమెను సస్పెండ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీపీఐ నారాయణ తనదైన శైలిలో చురకలు అంటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రోజాను చూసి కాళీమాతను చూసినట్లు వణికిపోతున్నారని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నాయని అన్నారు. ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే అసెంబ్లీలో ఎవ్వరూ మిగలరని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆయన స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిలో గెలిచిందని ఆరోపించారు.