: ట్రంప్ పై ట్వీట్.. సమస్యలో చిక్కుకున్న ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్!


అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ సమస్యలో చిక్కుకుంది. ఆ సంస్థ అకౌంట్ ను హ్యాక్ చేసి, అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు హ్యాకర్లు. "ట్రంప్ గారూ, మీరు మాకు ఎంతో విసుగు తెప్పిస్తున్నారు. అధ్యక్షుడిగా మీరు మాకు అవసరం లేదు. ఒబామా మళ్లీ తిరిగి రావడాన్ని మేము స్వాగతిస్తాం. మీరు చాలా చిన్న చేతులను కలిగి ఉన్నారు" అంటూ ట్వీట్ చేశారు. తక్కువ సాయం చేస్తారనే కోణంలో చిన్న చేతులు ఉన్నవారు అనే వాక్యాన్ని ట్వీట్ లో వాడారు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

తమ అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని 20 నిమిషాల తర్వాత మెక్ డీ గుర్తించింది. వెంటనే ట్వీట్ ను డిలీట్ చేసింది. కానీ, అప్పటికే అది 200 సార్లు రీట్వీట్ అయింది. ఈ ట్వీట్ కు ట్రంప్ వ్యతిరేకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మెక్ డీ ఇంతవరకు చేసిన ట్వీట్లలో ఇదే బెస్ట్ అని వారు కామెంట్ చేస్తున్నారు. డిలీట్ చేసిన ట్వీట్ ను మళ్లీ పోస్ట్ చేస్తే... 100 నగ్గెట్స్ కొంటామని మరికొందరు ఆఫర్ చేస్తున్నారు. హ్యాకర్లు పెట్టిన ట్వీట్ తో మెక్ డీ తల పట్టుకుంది. తమ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ ట్వీట్ తో తమకు సంబంధం లేదని వెల్లడించింది.

  • Loading...

More Telugu News