: జియోకు దీటుగా బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... రూ.339కే అపరిమిత కాలింగ్
రిలయన్స్ జియో విసిరిన పోటీకి ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కూడా దిగొచ్చింది. రూ.339కి సొంత నెట్ వర్క్ పరిధిలో అపరిమిత కాలింగ్ కు వీలు కల్పిస్తూ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనికి తోడు రోజుకు 2జీబీ 3జీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ కాల వ్యవధి 28 రోజులు. అలాగే, ప్రతీ రోజూ 25 నిమిషాల పాటు ఇతర నెట్ వర్క్ నంబర్లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే ప్రతీ నిమిషానికి 25 పైసల చార్జ్ పడుతుంది.
రిలయన్స్ జియో ఏప్రిల్ 1 నుంచి ప్రతీ నెలా రూ.303 రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, డేటా కూడా ఉచితమేనని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇందు కోసం ఈ నెలాఖరు నాటికి రూ.99 చెల్లించడం ద్వారా జియో ప్రైమ్ మెంబర్ షిప్ పొందాల్సి ఉంటుంది.