: ధోనీ ఉన్న హోటల్లో అగ్ని ప్రమాదం!


ఢిల్లీలోని ద్వారక హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే హోటల్ లో క్రికెట్ స్టార్ ధోని నేతృత్వం వహిస్తున్న జార్ఖండ్ జట్టు బస చేసింది. ప్రమాదం నేపథ్యంలో, అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే, హోటల్ సిబ్బంది వీరందరినీ సురక్షితంగా అక్కడ నుంచి బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. బెంగాల్, జార్ఖండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News