: తల్లికి తోడుగా ఉండేందుకు విదేశాలకు వెళ్లనున్న రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు పయనమవుతున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా చికిత్సకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో తల్లికి తోడుగా ఉండేందుకు రాహుల్ గాంధీ సమాయత్తమవుతున్నారు. సోనియా గాంధీకి ఆరోగ్యం చేకూరి, స్వదేశానికి తిరిగి వచ్చే వరకు రాహుల్ గాంధీ ఆమెకు తోడుగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్ దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు.