: ఆ మూడు శాఖలు మంత్రి సిద్ధూకి కేటాయించారు
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా, మరో తొమ్మిది మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మంది మంత్రుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. అయితే, మంత్రులుగా వారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తున్నట్లు ప్రకటించలేదు. ఆ వివరాలను ఈ రోజు సాయంత్రం ప్రకటించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక శాఖల బాధ్యతలను అప్పగించారు. మరో నేత మన్ ప్రీత్ బాదల్ ఆర్థికశాఖ, సీనియర్ నేత బ్రాహ్మ్ మొహిందర్ కు ఆరోగ్య శాఖను కేటాయించారు. కాగా, డిప్యూటీ సీఎం పదవిపై సిద్ధూ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. ఆ హోదా లభించకపోవడంతో మంత్రి పదవితో సిద్ధూ సంతృప్తి పడనున్నారు.