: ఏడేళ్ల నా కెరీర్లో ఐదేళ్లు బాహుబలి సెట్లోనే గడచిపోయాయి!: రానా దగ్గుబాటి


తెలుగు సినీ పరిశ్రమలో తన కెరీర్ వయసు ఏడేళ్లైతే ఐదు సంవత్సరాలు 'బాహుబలి' సెట్ లోనే గడిచిపోయాయని రానా చెప్పాడు. ఐదేళ్ల పాటు ఈ సినిమాలో భాగమైన ప్రతిఒక్కరూ అంకిత భావంతో పని చేశారని అన్నాడు. అలా చేయడం వల్లే ఈ రోజు సినిమా ట్రైలర్ ఇంత ఆదరణ పొందుతోందని చెప్పాడు. 'బాహుబలి: ది బిగినింగ్'ను అద్భుతంగా ఆదరించారని, 'బాహుబలి 2: ది కన్ క్లూజన్'ను కూడా ఆదరించాలని ఆకాంక్షించాడు. సినిమా కోసం అందరితోపాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందని రానా చెప్పాడు. తాము పరీక్ష రాశామని, ప్రేక్షకులు ఫలితాన్నివ్వాల్సి ఉందని రానా చెప్పాడు. 

  • Loading...

More Telugu News