: 6,54,00,000 గెలుచుకున్నావయ్యా అంటే 'నిజమా? ఛ.. ఊరుకోండి!' అన్న భారతీయుడు!


అదృష్టం, అవకాశం పదేపదే తలుపుతట్టవు... అవి వచ్చినప్పుడు తెచ్చే ఆనందానికి అంతుండదు అన్న విషయం దుబాయ్ లో ఉంటున్న భారతీయుడి విషయంలో నిజమైంది. దుబాయ్ లో భారతీయుడైన ఫ్రాన్సిస్ గ్జేవియర్ క్లీటూస్ (46) బోట్ కెప్టెన్ గా చాలా కాలం నుంచి పని చేస్తున్నాడు. భారత్ లో అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయితే వారిని కూడా దుబాయ్ తీసుకెళ్తే పోషణ భారమవుతుందని భావించి వారిని భారత్ లో ఉంచి ఆయనే అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు.

ఈ క్రమంలో ఆయనకు మంగళవారం ఒక వ్యక్తి ఫోన్ చేసి దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ నిర్వహించిన 1 మిలియన్ డాలర్ల లాటరీ మీరు గెలుచుకున్నారని శుభవార్త చెప్పాడు. అయితే, తనతో ఎవరో జోక్ చేస్తున్నారని భావించి, నిజమా? అని వ్యంగ్యంగా అడిగాడు. ఆ తరువాత అతను అన్ని వివరాలు చెప్పడంతో నిజంగానే తనకు లాటరీ తగిలిందని నిర్ధారించుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ లాటరీలో అతను గెలుచుకున్న మొత్తం 6 కోట్ల 54 లక్షల రూపాయలు కావడం విశేషం. దీంతో తన భార్య, తమ ఇద్దరు పిల్లల్ని దుబాయ్ కి తెచ్చుకుంటానని గ్జేవియర్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News