: ఎన్నికల సంఘాన్ని కలిసిన శశికళ వర్గం!


అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గం ఈ రోజు ఈసీని కలిసింది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ఈసీని కలిసి శశికళే తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అని తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగానే శశికళ ఎన్నిక జరిగిందని చెప్పారు. అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, పరోక్షంగా పన్నీర్ సెల్వం వర్గంపై విమర్శలు గుప్పించారు. కొంత మంది అనవసరంగా లేనిపోని సమస్యలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆర్కే నగర్ ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు.

మరోవైపు, అంతకు ముందు ఈసీని పన్నీర్ సెల్వం కలిసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె అర్హురాలు కాదని... ఆమె ఎన్నిక చెల్లదని ఈసీకి పన్నీర్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, పార్టీ రెండాకుల గుర్తును కూడా తమ వర్గానికే కేటాయించాలని కోరారు.

  • Loading...

More Telugu News