: డ్యాన్స్ చేస్తుంటే ముద్దుగుమ్మ విగ్గు ఊడింది!
బాలీవుడ్ యువనటి అలియా భట్ ఈమధ్య ఓ వేడుకలో తన సహచర తారలకు కావలసినంత వినోదాన్ని పంచింది. ఆ వివరాల్లోకి వెళితే, ఈ మధ్య జరిగిన జీ సినీ అవార్డ్స్ వేడుకలో అలియా ప్రత్యేక డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా అందంగా తయారై తన్మయత్వంతో డాన్స్ చేస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆమె విగ్గు ఊడిపోయింది. దీంతో ఆమె డాన్స్ ను ఆసక్తిగా తిలకిస్తూ ముందువరుసలో కూర్చున్న సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, వరుణ్ ధావన్ లు పెద్దగా నవ్వేశారు. అలియా స్నేహితుడైన వరుణ్ మరికాస్త ఎక్కువ సేపు నవ్వాడు. దీనిని గమనించని అలియా తన డాన్స్ పూర్తి చేసింది. ఆ తరువాత జరిగినది తెలుసుకుని తనూ నవ్వేసింది.