: ఉచిత విమాన ప్రయాణం... ఉచిత వసతి... టెక్కీ ఇంటర్వ్యూలకు న్యూజిలాండ్ ఆఫర్


మీరు ఇంజనీరింగ్ పట్టభద్రులా... అయితే, న్యూజిలాండ్ ఇస్తున్న అద్భుత ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రతిభ గల ఇంజనీర్ల కోసం న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ నగరం అన్వేషణ మొదలు పెట్టింది. అభ్యర్థులు ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా వెల్లింగ్టన్ కు ఇంటర్వ్యూ కోసం వచ్చేందుకు వీలుగా ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి కల్పిస్తామని ప్రకటించింది.

వెల్లింగ్టన్ నగరంలోని ప్రముఖ సంస్థలు 100 మంది ఇంజనీర్లను నియమించుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 8 -11 తేదీల మధ్య నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు, టెక్ లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసింది. దీనికి హాజరయ్యేందుకు గాను అభ్యర్థులకు ఉచిత ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ తెలిపారు.

ముందుగా అభ్యర్థులు తమ సీవీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం వీడియో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగ సంస్థలు కాల్ చేసి అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. వారి ప్రతిభ నచ్చితే అదే విషయాన్ని పేర్కొంటూ వారి అభ్యర్థిత్వాలను సిఫారసు చేస్తాయి. దాంతో అప్పుడు ప్రత్యక్ష ఇంటర్వ్యూల కోసం అభ్యర్థులు వెల్లింగ్టన్ కు ప్రయాణం కట్టాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News