: ఇస్లాం కోసం భద్రతా బలగాలపై దాడులకు దిగాలంటూ హిజ్బుల్ ముజాహిదీన్ పిలుపు!


హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ జాకిర్ ముసా ఓ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశాడు. ఇస్లాం కోసం జమ్మూ కశ్మీర్ లో భద్రతా బలగాలపై దాడులు చేయాలని అందులో పిలుపునిచ్చాడు. భద్రతా బలగాలపై రాళ్లతో విరుచుకుపడాలని సూచించాడు. జాతీయ వాదం పేరుతో రాళ్లు విసరొద్దని, ఇస్లాం కోసం ఆ పనిచేయాలని కోరాడు. జమ్మూ కశ్మీర్ పోలీసులు సాయుధ బలగాలకు మద్దతు పలకడం ఆపాలని, లేకుంటే రానున్న యద్ధంలో వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తారని హెచ్చరించాడు. సోషల్ మీడియా ద్వారా భద్రతా బలగాల జాడలను తెలియజేయాలని యువతను కోరాడు. ప్రజాస్వామ్యాన్ని తోసిపుచ్చుతూ అందరూ ఇస్లాం వైపు అడుగులు వేయాలని సూచించాడు. ఇస్లాంలో జాతీయవాదం, ప్రజాస్వామ్యానికి చోటు లేదన్నాడు. గతేడాది కాలంలో జాకిర్ ముసా పోస్ట్ చేసిన మూడో వీడియో ఇది.

  • Loading...

More Telugu News