: మన కొత్త నోట్లను ముద్రించడానికి ఒక్కో నోటుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?


పాత నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 2000 విలువైన కొత్త కరెన్సీని చలామణిలోకి తెచ్చింది. ఈ నోట్లను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఒక రూ. 500 నోటును ప్రింట్ చేయడానికి రూ. 2.87 నుంచి రూ. 3.09 ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ఒక రూ. 2000 నోటును ప్రింట్ చేయడానికి రూ. 3.54 నుంచి రూ. 3.77 ఖర్చవుతోందని తెలిపారు.

ఒక్కో కొత్త నోటు ప్రింటింగ్ కు ఎంత ఖర్చు అవుతోందంటూ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అయితే, మొత్తం నోట్ల ముద్రణకు ఎంత ఖర్చయిందనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ముద్రణకు అవుతున్న ఖర్చు గురించి ఇప్పుడు చెప్పడం సరికాదని అన్నారు. కొత్త నోట్ల ప్రింటింగ్ నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు.     

  • Loading...

More Telugu News