: భారీ వర్షం పడింది .. బంగారం బయటపడింది!
అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు భూమిలోని బంగారాన్ని బయటకు తెచ్చాయి. భారీగా కురుసిన వర్షాలు ఫ్లోరిడా వాసులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అయితే ఈ వర్షాల ధాటికి అక్కడ బంగారు గనులు బయటపడ్డాయి. కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ప్రవహిస్తున్న నీటిలో బంగారు సిరలు (రజను) కనిపిస్తున్నాయి. దీంతో స్ధానికులు బంగారం వేటలో పడ్డారు. ఎండాకాలంలో అక్కడ మరింత బంగారం బయటపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.