: కేంద్రంతో ఘర్షణ పడలేదు.. సామరస్యపూర్వకంగా సాధించుకుంటున్నాం: చంద్రబాబు


కేంద్రంతో ఏనాడూ రాజీపడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో తాను ఘర్షణ పడాలని కొంతమంది కోరుకున్నారని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా సామరస్యపూర్వకంగా పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుంటున్నామని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్యాకేజీని అమలు చేస్తోందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. ఇస్రోతో కలిసి పని చేసి మ్యాపుల ద్వారా ఏపీలో ఎక్కడెక్కడ పవర్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు, ప్రాజెక్టులు నిర్మించేందుకు ఉన్న అనుకూల పరిస్థితులు ఏమిటి? అన్న అంశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News