: రాత్రికి రాత్రే వేల కోట్లకు అధిపతైన అదృష్టవంతుడు!


అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవచ్చని అమెరికాలోని ఇండియానాకు చెందిన వ్యక్తి నిరూపించాడు. అమెరికాలోని ఇండియానా స్టేట్ లో పవర్ బాల్ వంటి భారీ లాటరీ సంస్థలు 39 ఉన్నాయి. దీంతో జాక్ పాట్ కోసం లాటరీ టికెట్లను భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మాన్యుఫేక్చరింగ్ కంపెనీలో పని చేసే కార్మికుడికి ఏకంగా 435 మిలియన్ డాలర్ల (2862 కోట్ల రూపాయలు) లాటరీ దక్కింది. దీంతో ఈ లాటరీ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. అమెరికా లాటరీ చరిత్రలో ఈ లాటరీ అతిపెద్ద 10వ లాటరీగా గుర్తింపు పొందింది. లాటరీని నిర్వహించిన సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ఈ లాటరీలో 435 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి తన పేరు, వివరాలను వెల్లడించవద్దని కోరడంతో పవర్ బాల్ సంస్థ వాటిని గోప్యంగా ఉంచింది. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఫలితం గురించి మాత్రం ఎదురు చూడలేదని ఆ సంస్థ తెలిపింది.

అతని ఇంటికి ఫోన్ చేయగా, విధులకెళ్లినట్టు సమాధానమిచ్చారని లాటరీ సంస్థ వెల్లడించింది. దీంతో అతని సోదరుడుకి విషయాన్ని చెప్పారు. ఈ శుభవార్త చెప్పేందుకు అతను సోదరుడికి ఫోన్ చేయగా, ఆయన కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదని, దీంతో అతని తండ్రి ఫోన్ చేసి, లాటరీ గెలిచావని చెప్పడంతో 'ఊరుకోండి నాన్నా... జోక్ చేయకండి' అంటూ సమాధానమిచ్చాడని అన్నారు. తరువాత డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం అతనికి లాటరీని నిర్వహించిన పవర్ బాల్ సంస్థ పంపిన లేఖ చూపించడంతో లాటరీ గెలిచినట్టు గుర్తించి, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వచ్చిన డబ్బులో 1243కోట్ల రూపాయలు తనకు అందుతాయని, మిగిలిన మొత్తం ట్యాక్స్ ల రూపంలో ప్రభుత్వానికి చెందుతుందని ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యుల విద్య కోసం, కొంత మొత్తాన్ని కుటుంబం కోసం వినియోగిస్తానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News