: బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్‌కు ఇంకా ఒక్కరోజే ఉంది.. నాకు ఆందోళనగా ఉంది: బాహుబలి నిర్మాత
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ట్రైలర్ రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై స్పందిస్తూ తనకు కాస్త అందోళనగా ఉందని అన్నారు. బాహుబలి-2 ట్రైలర్ విడుదలకు అంతా సిద్ధమైందని, ఇంకా ఒక్కరోజు ఉందని, అయితే తనకు కొంత టెన్షన్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులందరికీ ఆ ట్రైలర్ నచ్చుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్రైలర్‌తోపాటు సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా అందులో జత చేసి చూపిస్తామని ఆయన అన్నారు. బాహుబలి2 చిత్ర ట్రైలర్ కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్‌ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Here we go.. ! @BaahubaliMovie 2 trailer CBFC cert.! Just a day more! A little nervous I must say .. hope all of you will love it ! pic.twitter.com/kYkCgnH1lY
— Shobu Yarlagadda (@Shobu_) March 15, 2017