: నా కాళ్లు విరగ్గొట్టినట్టయిందని ప్రధానికి చెప్పాను: సీఎం కేసీఆర్


తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉండి, ఆదాయం ఊపందుకున్న సమయంలో వెలువడ్డ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో తన కాళ్లు విరగ్గొట్టినట్టు అయిందని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తాము మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న సమయంలో పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందన్నారు.

ఆ ప్రకటన వెలువడిన అనంతరం ప్రధానితో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని తానేనని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తమ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, తన కాళ్లు విరగ్గొట్టినట్టు అయిందని నాడు ప్రధాని మోదీకి వివరించి చెప్పానని కేసీఆర్ అన్నారు. గుజరాత్ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ ఎక్కువ వృద్ధి రేటుతో మంచి ఆదాయం సాధించినందుకు ప్రధాని తనను అభినందించారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందంటూ మోదీ తనను ప్రశంసించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. 

  • Loading...

More Telugu News