: దీపికా పదుకునే అభిమానులకు క్లారిటీ ఇచ్చిందా?
బాలీవుడ్ క్రేజీ లవర్స్ రణ్ వీర్ సింగ్-దీపికా పదుకునే మధ్య విభేదాలు వచ్చాయా? వారిద్దరూ విడిపోయినట్టు వచ్చిన వార్తలు నిజమేనా? అన్న అనుమానం బాలీవుడ్ అభిమానులను పట్టిపీడిస్తోంది. దీనికి కారణం ఏంటంటే, హోలీ సందర్భంగా దీపికా పదుకునే పోస్టు చేసిన ఫోటో పలు అనుమానాలకు తావిచ్చింది. బాలీవుడ్ లో తన తొలి ప్రేమికుడు రణ్ బీర్ కపూర్ తో నటించిన 'యే జవానీ హై దివానీ' సినిమాలో సన్నివేశానికి సంబంధించిన ఫోటోను దీపికా పదుకునే పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో రణ్ వీర్-దీపిక ప్రేమాయణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
హాలీవుడ్ లో దీపిక నటించిన 'ట్రిపులెక్స్' సినిమాలో హీరో విన్ డీజిల్ తో సన్నిహితంగా ఉండడం ఇష్టం లేని రణ్ వీర్ సింగ్ ఆమెకు కటీఫ్ చెప్పాడని భాలీవుడ్ లో వార్తలు వెలువడ్డాయి. ఒకవేళ దీపిక-రణ్ వీర్ మధ్య బంధం ఇంకా బలంగా ఉంటే కనుక 'రామ్ లీలా' సినిమాలో హోలీ సన్నివేశం సందర్భంగా తీసిన ఫోటోను పోస్టు చేసి ఉండేది కదా? అని అభిమానులు పేర్కొంటున్నారు. రణ్ బీర్ తో ఫోటో పెట్టి తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడిందని దీపిక తెలివిగా చెప్పిందని బాలీవుడ్ పేర్కొంటోంది.