: మా మనసులు కూడా గెలుచుకోండి, మోదీజీ!: ప్రధానికి పాకిస్థాన్ బాలిక ఆసక్తికర లేఖ
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ కు చెందిన 11 ఏళ్ల బాలిక అకిదత్ నవీద్ ఆసక్తికర లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్ లో అద్భుతమైన విజయం సాధించినందుకు లేఖలో మోదీకి ఆ చిన్నారి అభినందనలు తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొనాలని... ఈ శాంతి ప్రక్రియను మోదీ వేగవంతం చేయాలని అభిలషించింది. ఉత్తరప్రదేశ్ ప్రజల మనసులను గెలుచుకున్న విధంగానే మరింతమంది భారతీయ, పాకిస్థానీ ప్రజల హృదయాలను మోదీ గెలుచుకోవాలని కోరింది.
ప్రజల హృదయాలను గెలుచుకోవడం అన్నిటికంటే గొప్ప విషయం అని తన తండ్రి తనకు చెప్పారని లేఖలో ఆ చిన్నారి తెలిపింది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను నెలకొల్పితే మీరు మరింత మంది ప్రజల మనసుల్లో నిలిచిపోతారని చెప్పింది. బుల్లెట్స్ కొనకూడదు, బుక్స్ మాత్రమే కొనాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపింది. అదే విధంగా గన్స్ కొనకుండా, పేద ప్రజలకు మందులు కొనాలని నిర్ణయించామని చెప్పింది. శాంతిని ఎంచుకోవాలా? లేదా సమస్యను ఎంచుకోవాలా? అనే విషయాన్ని నిర్ణయించుకునే ఛాయిస్ మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది.