: అత్యాచారం చేసిన వ్యక్తి తరపున ప్రచారం చేస్తారా?: అఖిలేష్ పై మోదీ ధ్వజం


ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీ సాధించిన బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయినప్పటికీ, సమాజ్ వాదీ పార్టీని, అఖిలేష్ సింగ్ యాదవ్ ను మాత్రం ప్రధాని మోదీ ఇంకా వదలడం లేదు. ఆయన మాటల తూటాలకు అఖిలేష్ బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గ్యాంప్ రేప్ కేసులో నిందితుడైన మాజీ మంత్రి, ఎస్పీ నేత గాయత్రి ప్రజాపతి అంశం బీజేపీకి బలమైన ఆయుధంగా మారింది.

దేశమంతా గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటే... సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు మాత్రం అత్యాచారం కేసులో ఇరుక్కున్న గాయత్రీ ప్రజాపతి మంత్రాన్ని పఠిస్తున్నాయంటూ మోదీ విరుచుకుపడ్డారు. ప్రజాపతిపై అత్యాచారం కేసు నమోదైనా... ఆయకు అఖిలేష్ యాదవ్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని... అఖిలేష్ చేసిన పని ఏమాత్రం సమర్థనీయం కాదని విమర్శించారు. ప్రజలను హింసించిన వారికి బుద్ధి చెప్పే అవకాశం యూపీ ప్రజలకు వచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News