: వ్యాపారాన్ని ఆపేసి.. పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్!


దాయాది దేశం పాకిస్థాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. ఆ దేశంతో క్రాస్ బోర్డర్ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిషేధించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ నిరంతరం కాల్పుల ఉల్లంఘనకు తూట్లుపొడుస్తూ, యథేచ్చగా కాల్పులకు తెగబడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పూంచ్ సెక్టార్ లో నిన్న మళ్లీ పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో... భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పూంచ్ నుంచి పాకిస్థాన్ కు ఉన్న రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసింది.

ఈ నేపథ్యంలో, పాక్ కు సరుకులతో వెళ్లాల్సిన ట్రక్కులు నియంత్రణ రేఖ వద్దకు చేరుకోగా... గేట్లు తెరవలేదు. దీంతో, ట్రక్కులన్నీ వెనక్కి వచ్చేశాయి. మరోవైపు పాక్ నుంచి వస్తున్న ట్రక్కుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమవుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News