: గతంలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన నితిన్ కపూర్!


ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నితిన్ కపూర్ ఆ తరువాత జయసుధను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆమె ప్రధాన పాత్రధారిగా కొన్ని సినిమాలను నిర్మించారు. అవేవీ ఆయన కోరుకున్న ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయారు.

ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారని, తరువాత ఆయన కోలుకోలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయితే ఆయన ఏ విషయంలోనూ ఇబ్బందులపై నోరు జారలేదని వారే పేర్కొంటున్నారు. అయితే నష్టాలను ఎదుర్కోవడంలో ఆయన జయసుధ అంతటి పరిణతి చూపించలేకపోయారని... అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News