: బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ నిర్ణయం ఎంత మాత్రం ఉపయోగపడదు: ఆర్థిక వేత్త టీఎన్ శ్రీనివాసన్
దేశంలో నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏమాత్రం ఉపయోగపడదని అమెరికాలోని యేల్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త టీఎన్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో భారత్ లో అవినీతిని కూకటివేళ్లతో పెకలించి, పారదర్శకత పెంచడం జరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్ లో పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లుగా ముందుగా చెప్పలేదని, ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన లేదని దీనిని బట్టి అర్థమవుతోందని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఈ విషయమై కేంద్ర గణాంక శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖకు ప్రభుత్వం సరైన లక్ష్యాలను నిర్దేశించలేకపోయిందని అన్నారు.