: ప్రధానికి ‘ఫ్లిప్ కార్ట్’ సీఈఓ ప్రశంస.. స్పందించిన మోదీ!
మన దేశ ప్రజలను ప్రధాని మోదీ ఎంత బాగా అర్థం చేసుకుని తన వైపు తిప్పుకున్నారో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే నిదర్శనమని ఫ్లిప్ కార్ట్ సీఈఓ సచిన్ బన్సల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూస్తేనే తెలుస్తోందని, ఇటీవల వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా మోదీ మన దేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారనే విషయం అర్థమవుతుందని, ఇది వ్యాపారవేత్తలకు ఓ పాఠం కావాలని, మోదీ ఏ విధంగా అయితే ప్రజలను అర్థం చేసుకున్నారో, ఖాతాదారులను అర్థం చేసుకునే విషయంలో వ్యాపారవేత్తలు అదే మార్గాన్ని అనుసరించాలని ఆ ట్వీట్ లో ఆయన సూచించారు. కాగా, ఈ ట్వీట్ కు ప్రధాని మోదీ స్పందిస్తూ, ‘ప్రజలను నేను అర్థం చేసుకోవడం కన్నా, బీజేపీపై వారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని మేము పోగొట్టుకోము’ అని అన్నారు.