: తమ సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ.. ట్యాంక్ బండ్ పై టీడీపీ ఆందోళన!


బడ్జెట్ సెషన్స్ కు హాజరు కాకుండా తెలంగాణ శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను పరిహాసం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టీడీపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను తక్షణం ఎత్తి వేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News