: వైఎస్సార్సీపీకి కనీస విజ్ఞత కూడా లేకుండా పోయింది : నారా లోకేశ్


టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో గొప్ప నేతను కోల్పోయామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో సంతాప తీర్మానానికి వైఎస్సార్సీపీ రాకపోవడం శోచనీయమని, ఆ పార్టీ కనీస విజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కాగా, భూమా సంతాప తీర్మానానికి వైఎస్ జగన్ రాకపోవడంపై భూమా అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News