: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తండ్రి మృతి!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. ఆయన తండ్రి షణ్ముఖం ఈ ఉదయం మృతి చెందారు. బేగంపేటలోని శ్యామల బిల్డింగ్స్ లో ఉన్న గోదావరి అపార్ట్ మెంట్ లో ఆయన తుది శ్వాస విడిచారు. షణ్ముఖం ప్రస్తుత వయసు 81 సంవత్సరాలు. ఉమ్మడి ఏపీలో చేబట్టిన పలు సంచలన కేసుల ద్వారా జేడీ లక్ష్మీనారాయణ వెలుగులోకి వచ్చారు. సిన్సియర్ అధికారిగా ఆయన అందరి మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పని చేస్తున్నారు.