: ఇక ఏడవను... మళ్లీ కన్నీరు పెట్టుకునే సందర్భం అదే: అఖిలప్రియ
తనను, తన తమ్ముడు, చెల్లెళ్లను ఒంటరి వాళ్లను చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయిన తల్లిదండ్రులను తలచుకుని ఏడవటం నిన్నటితో ముగిసిందని, ఇక తాను వారి గురించి తలచుకుని ఏడుస్తూ ఉండిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఇక వారి కోరికలైన నంద్యాలలో పేదలకు పది వేల ఇళ్లు, రోడ్ల విస్తరణ, నీటి సమస్య తీర్చడంపై దృష్టిని పెడతానని, ఈ సమస్యలన్నీ తీరిన రోజున తన తండ్రిని తలచుకుని మనస్ఫూర్తిగా ఏడుస్తానని చెప్పారు. ఇక నియోజకవర్గాలపై దృష్టి సారించి, అభివృద్ధే లక్ష్యంగా సాగుతానని హామీ ఇచ్చారు.