: ఊరుకోం.. దాడులు చేస్తాం జాగ్రత్త.. అమెరికాను గట్టిగా హెచ్చరించిన ఉత్తరకొరియా
చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తుండడంతో, అగ్రరాజ్యాన్ని చైనా ఇటీవల తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు ఉత్తరకొరియా కూడా వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా నేవి సూపర్ క్యారియర్ 'కార్ల్ విన్సన్'ను మోహరిస్తున్న నేపథ్యంలో తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా పేర్కొంది.
తమ సైన్యం వాయు, జల, భూమార్గాల ద్వారా ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా దాడులు చేయడానికి సిద్ధమేనని ఉత్తరకొరియా అధికార న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ తెలిపింది. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని అభిప్రాయపడింది. మూడు రోజుల క్రితం ఆయా దేశాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని తెలిపింది.