: 'టోలు' తీశారు.. రూ. 40కి బదులు రూ. 4 లక్షలు స్వైప్ చేశారు


ఏం డిజిటలైజేషనో ఏమో కానీ... కార్డ్ స్వైపింగ్ లతో జనాలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక్కొక్క సారి ఎంత డబ్బు స్వైప్ అవుతుందో కూడా తెలియదు. ట్రాన్స్ ఫర్ అయిన డబ్బుకు సంబంధించి మెసేజ్ లు కూడా సరిగ్గా రావు. ఇలాంటి ఘటనే తాజాగా కొచ్చి-ముంబై జాతీయ రహదారిపై జరిగింది. గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూరుకు చెందిన ఓ డాక్టర్ కార్డు ద్వారా రూ. 40 టోల్ గేట్ ఫీజ్ చెల్లించారు. అయితే కార్డును స్వైప్ చేసిన టోల్ గేట్ అటెండెంట్ రూ. 40కి బదులు రూ. 4 లక్షలు స్వైప్ చేశాడు. రూ. 40కి రశీదు ఇచ్చాడు. కానీ, డాక్టర్ ఫోన్ కు మాత్రం రూ. 4 లక్షలు అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది.

దీంతో, వెంటనే ఆయన టోల్ గేట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే, వారు మాత్రం తమ తప్పిదాన్ని ఒప్పుకోలేదు. దీంతో, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కన్నెర్ర చేయడంతో, వారు తమ తప్పిదాన్ని చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. తప్పుడు మొత్తాన్ని స్వైప్ చేసినట్టు టోల్ గేట్ అటెండెంట్ ఒప్పుకున్నాడు. తమ తప్పిదానికి బదులుగా నగదుతో పాటు అదనపు మొత్తాన్ని కూడా టోల్ గేట్ యాజమాన్యం ఆఫర్ చేసింది. అయితే, డాక్టర్ మాత్రం తన డబ్బును మాత్రమే తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News